కుడుముల పరశురాం కుటుంబానికి బాసట
న్యూస్ పవర్ , 8 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
ఇటీవలే మరణించిన కుడుముల పరశురాం కుటుంబానికి పలువురు దాతలు అండగా నిలిచారు. పరశురాం మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బిల్లమీది పర్శరాము 50 కేజీల బియ్యాన్ని, ఫీల్డ్ అసిస్టెంట్ చేర్ల శ్రీనివాస్ 25 కేజీల బియ్యాన్ని, అలాగే పెంకాసుల రమేష్ 5 కేజీల వంటనూనెను కుడుముల పరశురాం కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారు ఈ సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో దొంతి సుధాకర్, దొంతి రవీందర్, జెట్టి రాజు, దొంతి స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.
