సీఎం కప్ పోటీల్లో సత్తా చాటిన ఇల్లంతకుంట క్రీడాకారులు
న్యూస్ పవర్ ,8 ఫిబ్రవరి ,తిమ్మాపూర్/ఇల్లంతకుంట:
మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ (2025-26) క్రీడా పోటీలలో ఇల్లంతకుంట మండల క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలలో ఇల్లంతకుంట మండలానికి చెందిన జట్లు పలు విభాగాల్లో విజయకేతనం ఎగురవేశాయి.
ఈ పోటీల ఫలితాల వివరాలు:
వాలీబాల్ (బాలుర విభాగం): ప్రథమ స్థానం
కబడ్డీ (బాలుర విభాగం): ద్వితీయ స్థానం
కబడ్డీ (బాలికల విభాగం): ద్వితీయ స్థానం
ఖో-ఖో (బాలుర విభాగం): ద్వితీయ స్థానం
ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్. సంపత్ రావు మరియు సాన బాబు మాట్లాడుతూ, ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగబోయే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు.
నియోజకవర్గ స్థాయిలో మండల పేరును నిలబెట్టిన క్రీడాకారులను ఎంపిడిఓ శశికళ, మండల విద్యాధికారి సిహెచ్. శ్రీనివాస్, మండల సర్పంచులు, సీనియర్ క్రీడాకారులు మరియు వివిధ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
