రేపాకలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి: ఏఎస్ఐ బాల్ రెడ్డి
న్యూస్ పవర్, 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
రేపాక గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, దొంగతనాలు నివారించడానికి సీసీ కెమెరాల ఏర్పాటుకు సర్పంచ్ మరియు గ్రామస్తులు సహకరించాలని వీపీవో ఏఎస్ఐ బాల్ రెడ్డి కోరారు. రేపాక గ్రామ పంచాయతీని సందర్శించిన ఆయన, సర్పంచ్ కాత మల్లేశం తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలన్నా, దొంగతనాలు అరికట్టాలన్నా నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. దీనికి స్పందించిన గ్రామ శాఖ అధ్యక్షుడు గూడ బాబు, తన వంతు సహాయంగా గ్రామంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోదని మహేష్, శేఖర్, సంతు తదితరులు పాల్గొన్నారు.
