కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన వల్లంపట్ల ఉపసర్పంచ్ కర్ల వంశీ
న్యూస్ పవర్, 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ కర్ల వంశీ (చింటూ) ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ , రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట అగయ్య మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు , ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి , సెస్ డైరెక్టర్ మల్లు రవీందర్ రెడ్డి మరియు వల్లంపట్ల గ్రామ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు.
వంశీ తో పాటు 8వ వార్డు సభ్యులు లింగంపల్లి నాగరాజ్ , 10వ వార్డు సభ్యులు ఎరవెల్లి వెన్నెల ఆంజనేయులు , ధర్మయపల్లె యూత్ సభ్యులు మారుపాక అనిల్, సందవేని సంపత్, శ్రీరాముల రాకేష్, కర్ల అనిల్, ఎండి రోహిత్, కోల్పాక ప్రకాష్ తదితరులు గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వల్లంపట్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండగ భాస్కర్, కొత్తపెళ్లి నూతన్ క్రాంతి, నాయిని మల్లేశం, నేరెళ్ల అశోక్ గౌడ్, ఒగ్గు రామకృష్ణ పాల్గొన్నారు.
