రాష్ట్రస్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో విద్యార్థిని 'మహిత'కు ప్రథమ స్థానం
న్యూస్ పవర్ , 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష ఫలితాల్లో ఇల్లంతకుంట మండలం, రహీంఖాన్ పేటలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థిని ఎన్. మహిత ఈ ఘనత సాధించింది. ఈ పోటీలో విజయం సాధించడానికి విద్యార్థినికి పాఠశాల పౌరశాస్త్ర ఉపాధ్యాయులు ఎల్. రాజు మరియు అర్థశాస్త్ర ఉపాధ్యాయులు జి. రాజు లు మార్గదర్శకులుగా వ్యవహరించి, తగిన సూచనలు అందించారు.
జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటిన విద్యార్థిని ఎన్. మహితను, ఆమె విజయానికి కృషి చేసిన మార్గదర్శక ఉపాధ్యాయులు ఎల్. రాజు, జి. రాజు ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్షుడు రెడ్డి రవి మరియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ లు ఘనంగా అభినందించారు. విద్యార్థులు ఇలాగే చదువులో రాణిస్తూ జిల్లాకు మరిన్ని విజయాలు అందించాలని వారు ఆకాంక్షించారు.
