గాలిపల్లి హై స్కూల్ కు మినీ ఆర్ ఓ ప్లాంటు ఉప సర్పంచ్ వితరణ
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మినీ ఆర్ ఓ ప్లాంట్ ను గ్రామ ఉప సర్పంచ్ రావుల శ్రీకాంత్ గౌడ్ వితరణ గా అందజేశారు. స్కూల్లో గత కొద్ది నెలలుగా ఇది వరకు వున్న ఆర్ ఓ పూర్తిగా చెడిపోయింది.పాఠశాలలో విద్యార్థుల మంచి నీటి కి స్వంత ఖర్చు తో బిగింపు చేసి సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మ శ్రీనివాస్,లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉప సర్పంచ్ ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయ బృందం, పలువురు నాయకులు పాల్గొన్నారు.
