గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సర్పంచ్ గౌరవేణి శ్రీవాణి సుమన్
న్యూస్ పవర్, 10 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గ్రామస్తులందరితో మమేకమై, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని బోటి మీది పల్లె సర్పంచ్ గౌరవేణి శ్రీవాణి సుమన్ స్పష్టం చేశారు.
బోటి మీది పల్లె గ్రామంలో, గ్రామ సర్పంచ్ గౌరవేణి శ్రీవాణి సుమన్, ఉప సర్పంచ్ గౌరవేణి లత నరేష్, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి గిరిజ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీవాణి సుమన్ మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, ప్రజలందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగుతామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌరవేణి లత నరేష్, గ్రామ కార్యదర్శి గిరిజ, వార్డు సభ్యులు, గ్రామ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
