పెద్ద పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ పవర్ , 9 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లా, కోహెడ మండలంలో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో రేపాక గ్రామ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
రేపాక గ్రామ పంచాయతీ కార్యాలయానికి విచ్చేసిన సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, గ్రామ సర్పంచ్ కాత మల్లేశం ని కలిసి పరిస్థితిని వివరించారు. పక్కనే ఉన్న కోహెడ మండలంలో పులి సంచారం ఉన్నందున, అది మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
