సిద్దిపేట – ఇల్లంతకుంట ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభం
న్యూస్ పవర్, 9 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గత కొంతకాలంగా నిలిచిపోయిన సిద్దిపేట – ఇల్లంతకుంట ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గ్రామ సర్పంచ్ ఎం. రాజు జెండా ఊపి బస్సు సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాజు మాట్లాడుతూ:
సిద్దిపేటకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇల్లంతకుంట మండల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను ఆర్టీసీ అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితంగా నేడు బస్సు సేవలు తిరిగి ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బస్సు సర్వీసు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది," అని తెలిపారు.
ఈ బస్సు సేవల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కృషి చేసిన ముస్కానిపేట సర్పంచ్ & మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకట్రావుపల్లి సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, తిప్పాపూర్ సర్పంచ్ మంజుల రమేష్, రేపాక సర్పంచ్ కాత మల్లేశం, మరియు వల్లంపట్ల గ్రామ యువకుడు మొగ్గం ప్రమోద్ కి సర్పంచ్ రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
