జిల్లా స్థాయి కరాటే పోటీల్లో జెడ్.పి.హెచ్.ఎస్ కందికట్కూర్ విద్యార్థుల ప్రతిభ
న్యూస్ పవర్, 10 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
వేములవాడ వేదికగా జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలలో కందికట్కూర్ జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
ఈ పోటీలలో పాఠశాలకు చెందిన తూటి నిత్యశ్రీ ద్వితీయ స్థానం సాధించగా... తూటి అశ్విత, ముత్త సౌమ్య, మరియు టేకు శ్రావణి తృతీయ స్థానాల్లో నిలిచి పతకాలను సొంతం చేసుకున్నారు.
క్రీడల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తెచ్చిన విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, కరాటే మాస్టర్ పసుల బాలరాజు మరియు ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.
