అనంతారంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యులకు గౌడ సంఘం ఘన సన్మానం
న్యూస్ పవర్ , 12 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
మండలంలోని అనంతారం గ్రామంలో ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. సంఘ అధ్యక్షుడు వొల్లాల అంజయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామ ప్రజల విశ్వాసంతో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు వొల్లాల లక్ష్మీ కృష్ణ కుమార్ గౌడ్, గోనపల్లి లావణ్య వెంకటేశం గౌడ్ లను శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రజిత వెంకటేశం మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని కులాలు, వర్గాల ప్రజలను సమానంగా పరిగణిస్తూ ప్రతి వార్డును సమాన అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం కృషి చేస్తానని, మాటల కంటే పనితోనే సమాధానం ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి దారి తీస్తుందని ఈ సందర్భంగా సంఘ సభ్యులు పేర్కొన్నారు. తనను ఘనంగా సన్మానించినందుకు గౌడ సంఘ సభ్యులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
