పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి
• ఇల్లంతకుంట ఎస్సై అశోక్
న్యూస్ పవర్ , 13 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ హెచ్చరించారు. ఈ మేరకు సోమారంపేట గ్రామంలో గ్రామస్తులకు పులి సంచారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ, మన ప్రక్క గ్రామాలైన గుండారం గుట్ట ప్రాంతంలో పులి సంచరిస్తుందని ఉదయం సమాచారం అందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ దృష్ట్యా ఆయన సూచనలు చేశారు
రైతులు తమ పశువులు, గొర్రెలు, మేకలను పొలాల వద్ద ఉన్న దొడ్ల కాడ ఉంచకూడదని, వాటిని ఇంటి వద్దనే సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. పులి పశువులను చంపే అవకాశం ఉందని తెలిపారు.
రాత్రి సమయాల్లో రైతులు గానీ, గ్రామస్తులు గానీ పొలాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.
అత్యవసరమై తప్పనిసరి పరిస్థితుల్లో పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తే, ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు.
