ఎగువ ప్రాంత రైతులకు నీరు అందించాలి
• పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరo వసంత నర్సయ్య
న్యూస్ పవర్ , 13 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
రంగనాయక సాగర్ ఎల్ ఎం 6 కాల్వ ద్వారా పెద్ద లింగాపూర్ బతుకమ్మ చెరువు నిండి మత్తడి పారడంతో మైసమ్మ గుడి వద్ద పూజ చేసి మత్తడి వద్ద టెంకాయ కొట్టి పూజ చేయడం జరిగింది
ఈ సందర్భంగా సర్పంచ్ గన్నేరo వసంత నర్సయ్య మాట్లాడుతూ పెద్ద లింగాపూర్ గ్రామంలోని 50 శాతం భూములు ఏలాంటి కరువు లేకుండా సాగవుతున్నాయని గ్రామానికి మెట్ట ప్రాంతం పై ఉన్న 50 శాతం భూములు ఫిబ్రవరి మాసం నుండే నీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు రంగనాయక సాగర్ ఎల్ ఎమ్ 6 ఫీడర్ ఛానల్ పూర్తి నిర్మాణం జరిగితే పెద్ద లింగాపూర్ రామోజీపేట చిక్కుడువానిపల్లి వెల్జిపూర్ తో పాటు తంగళ్ళపల్లి మండలంలో కూడా చాలా గ్రామాల సాగులోకి వస్తాయి అని ప్రభుత్వ స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు స్థానిక శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ తక్షణమే స్పందించి పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లవేని రమేష్ వార్డు మెంబర్ లింగంపల్లి అనిల్ కుమార్ మతి రెడ్డి రవీందర్ రెడ్డి సుద్దాల రామయ్య ఎద్దు నాగరాజు మతిరెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
