న్యూస్ పవర్ , 11 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
రామాజీపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ చొప్పరి భూమయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భూమయ్య మాట్లాడుతూ, గ్రామస్తులకు స్థానికంగానే ఉపాధి కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామంలోని కూలీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బసవరాజు జనార్ధన్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
