వాణి నికేతన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
న్యూస్ పవర్, 20 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట : పూలను పూజించే పండుగ అయిన బతుకమ్మ సంబరాలు వాణి నికేతన్ హైస్కూల్లో ఘనంగా జరిగాయి. బతుకమ్మ బ్లూమ్స్ కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థులు, తల్లులు ఇంటి వద్ద నుండి బతుకమ్మలను తీర్చుకొని వచ్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా పాడుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం గ్రామ సమీపంలోని బిక్క వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధి ల తోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
