ప్రజల చెంతనే సమస్యల పరిష్కారం
• ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
న్యూస్ పవర్ , 7 మే , ఇల్లంతకుంట :
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యేడాక్రర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట్, వెల్జీపూర్, ఓబుళాపూర్ గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. అంతే కాకుండా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళతానని, తద్వారా ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందేలా ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు. సమస్యలు చెప్పుకోవడం కోసం దూరప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి ఇక నుంచి రావల్సిన అవసరం ఉండదని, తమ సమస్యలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపించాలని,వాటిని పరిశీలించిన వెంటనే ఆయా గ్రామాలకు అధికారుల బృందంతో వచ్చి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఆయన విమర్శించారు. వారానికి మూడు రోజులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. రహీంఖాన్ పేట్, వెల్జీపూర్, ఓబులాపూర్ గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టి దృష్టికి తీసుకురాగా,సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెంటనే పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో నిర్మించతలపెట్టిన అంగన్ వాడీ కేంద్ర భవనానికి భూమి పూజ చేశారు. అలాగే చౌడాళమ్మ గుడిలో బోర్ వెల్ ప్రారంభించారు. ఓబులాపూర్ గ్రామంలో రెడ్డి సంఘ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఫారుక్, ఎంపీడీఓ శశికళ, సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవనజ్యోతి,ఐకేపీ ఏపీవో కె.వాణిశ్రీ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి,ఎలగందుల ప్రసాద్, సురేందర్ రెడ్డి, బి.శంకర్, గుండా వెంకటేశం, కేశవరెడ్డి, వీరేశం, కంకణాల రాంప్రసాద్, ఎం.బాల్ రెడ్డి, పర్షరాములు, స్వామిరెడ్డి, బొజ్జ శ్రీనివాస్,బాలయ్య, ఎడ్ల నితీష్ , కె.ప్రవీణ్ ఎం.శ్రీనివాస్, సోమిరెడ్డి అనిల్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
