రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కు రిజిస్ట్రేషన్
న్యూస్ పవర్ ,8 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల క్లస్టర్ రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి రవళి రైతు విశిష్ట గుర్తింపు నమోదు కార్యక్రమం నిర్వహించారు.ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన పీఎం కిసాన్, పంట బీమా వంటి పథకాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కి అనుసంధానం చేయడం జరుగుతుంది.విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు గానూ రైతులు తమ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్,మొబైల్ నెంబర్ తో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలి.అనంతరం లబ్ధి దారుని కి వచ్చిన ఒటిపి ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడం జరుగుతుంది. కావున రైతులు అందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని గుర్తింపు సంఖ్య ని పొందగలరని వివరించడం జరిగింది.