ప్రభుత్వం పంపిణీ చేసిన భూమికి హద్దులు నిర్ణయించండి

ప్రభుత్వం పంపిణీ చేసిన భూమికి హద్దులు నిర్ణయించండి 

న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు శుక్రవారం ఇల్లంతకుంట తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1978లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దళితులకు నివాస స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా కొన్ని ప్లాట్లకు సంబంధించి భూసేకరణ చేసి పంపిణీ చేయకుండా అలాగే వదిలేశారని గత రెండు సంవత్సరాల క్రితం దళితులు అప్పటి ఎమ్మార్వో కి సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది కానీ అదే సర్వే నెంబర్ లో ఉన్న ఒక రైతు ఈ భూమి తనదే అని ప్రభుత్వం తప్పుగా సర్వే చేసిందని కోర్టు ద్వారా అంబేద్కర్ సంఘ సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని కాబట్టి స్థానిక రెవెన్యూ అధికారులు మరొకసారి అట్టి భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించి 1978లో ఎంతమందికి పట్టా ఇష్యూ చేశారో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని స్థానిక తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 
అంబేద్కర్ సంఘo అధ్యక్షుడు పసుల నరేష్ కుమార్ సీనియర్ నాయకులు పసుల వెంకన్న గన్నేరo నర్సయ్య అంబేద్కర్ సంఘ సభ్యులు అనిల్ సంజిత్ అనిల్ శ్రీనివాస్ లచ్చయ్య మల్లేశం గ్రామ దళితులందరు
పాల్గొన్నారు.

Post a Comment

0 Comments