పంచాయతీరాజ్ వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి

పంచాయతీరాజ్ వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి 

న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట :
 తెలుగుదేశం పార్టీ మానకొండూరు నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2024-26 సంవత్సరమునకు గాను సభ్యత్వం పొందిన పార్టీ శ్రేణులకు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి దామెర సత్యం పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్డులను అందజేయడం జరిగింది.
 ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి దామెర సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అందుకోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ పైన కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని, అందుకోసం ఇప్పటినుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. 
 తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పంచాయతీరాజ్ వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని గ్రామాలలో పాలకవర్గాలు లేకపోవడం వలన అభివృద్ధి కుంటు పడిందని, తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు గెలుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దామర సత్యం కోరడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కన్వీనర్ గజ బీమ్ కార్ ఎల్లోజి, సీనియర్ నాయకులు చర్ల ప్రతాప్, అనుపురం చిరంజీవి, శ్రీనివాస్, కుమ్మరి నర్సయ్య, ఇమ్మడోజు మల్లికార్జున్, మహిళా నాయకురాళ్లు వసంత రాజవ్వ కులాల లక్ష్మి తారవ్వ అనసూయ తిరుపతమ్మ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments