కాల్వ పనులు తక్షణమే పూర్తి చేయాలి
న్యూస్ పవర్ , 6 మార్చి , ఇల్లంతకుంట :
కాలువ పనులు పూర్తి చేసితక్షణమే నీరుఅందించలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి ముషంరమేష్ కమిటీ సభ్యుడు
గన్నేరo నర్సయ్య అన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్
గ్రామంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్యాకేజీ లేవు 11/6 కాలువ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసి నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం మూలంగా ఇల్లంతకుంట మండలంలోని నాలుగు గ్రామాలు మరియు తంగళ్లపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాల రైతులకు నీరు వస్తుంది ఈ కాలువ నిర్మాణం పూర్తి చేసినట్లయితే ఈ 12 గ్రామాల్లోని సుమారుగా 9500 ఎకరాల వ్యవసాయ భూమి సస్యశ్యామలమవుతుందని ఈ ప్యాకేజీ లో భాగంగా రైతులకు సంఘీభావం తెలిపి తన యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగినది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి కాళేశ్వరం ప్యాకేజీ 11/6 ప్యాకేజ్ నిర్మాణ పనులకు వెంటనే పూర్తి చేసి ఈ సగటు రైతులను ఆదుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా ఇప్పటివరకు పలు గ్రామాల రైతులు సందర్శించి తమ యొక్క గోడును గత ప్రభుత్వంలో కేసీఆర్ చూసి చూడనట్టుగా వ్యవహరించడం జరిగింది.ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దటవేసే ధోరణిని అవలంభిస్తున్నరు. కావున ఇప్పటికయినా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వానికీ ఇట్టి సమస్యను వివరించి ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ పూర్తి స్థాయిలో చేసిన కూడా బాధిత రైతాంగానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కోరారు.రంగనాయక సాగర్ నుండి ఈ కాలువ పూర్తి అయితే 12 గ్రామాల రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు.ఈ కాలువ సమస్య రెండు నియోజకవర్గాలకు సంబంధించిన విషయం కావడం వల్ల ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇప్పటివరకు మనకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మరియు సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ కు గాని ఎలాంటి స్పందన లేదు.ఇలాగే వ్యవహరిస్తే రానున్న కాలంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వరు ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజి విమల సీనియర్ నాయకులు రాయమల్లు గురిజాల శ్రీధర్ అశోక్ ప్రభాకర్ అశోక్ మధు తదితరులు పాల్గొన్నారు.
