న్యూస్ పవర్, 4 మార్చి , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖన్ పేట్ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన పెద్దలింగాపూర్ గ్రామ డా బిఆర్ అంబేడ్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ జి గంగాధర్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు పసుల నరేష్ , మరియు మాజీ ఎస్ఎమ్సి చైర్మన్ బొప్ప రాములు , జనగాం శ్రీను, పసుల రంజిత్, కాంపెల్లి శ్రీను, పసుల రాజు, మరియు పాఠశాల ఉపాధ్యయులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
