న్యూస్ పవర్ , 4 మార్చి , ఇల్లంతకుంట :
జిల్లా ఉన్నత పాఠశాల దాచారంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశము మరియు పాఠశాల వార్షికోత్సవము జరుపుకోవడం జరిగింది ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా నృత్య ప్రదర్శన చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుండి ఈ పాఠశాలచదివి వదిలి వెళుతున్న పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలతో వారి యొక్క గత స్మృతులను అనుభవాలను విద్యార్థిని విద్యార్థులతో గురువులతో పంచుకోవడం జరిగింది 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి చదివి వెళుతున్న విద్యార్థిని విద్యార్థులకు 10వ తరగతిలో 10 జిిిపిఏ సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మేడం సీనియర్ ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శ్రీను, దావీద్,శ్రీనివాస్, ఆనంద్ కుమార్, సురేష్, సంజీవ్, శ్రవణ్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల గౌడ్,పంచాయతీ సెక్రెటరీ బాలరాజ్ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
