వాణి నికేతన్ హై స్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు
న్యూస్ పవర్, 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యార్థులు తయారుచేసిన 150 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 1928 ఫిబ్రవరి 28 న భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. మానవుని మనగడ సైన్స్ పై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. భారత ప్రభుత్వము సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధి, సైన్స్ టీచర్లు రాజు, కళ్యాణి, పద్మ, శాంత, సుమంగళి, ఉష, జలజల తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
