సౌడలమ్మ జాతర విజయవంతం
న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామం శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సౌడలమ్మ తల్లి జాతర మహోత్సవం 18వ తేది మంగళవారం మొదలుకొని 22వ తేది ఆదివారం వరకు అంగరంగ వైభవం జరిగింది, ఈ సందర్భంగా యాదవ సంఘము యూత్ అధ్యక్షుడు & ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కీ ప్రజాప్రతినిధులు,ప్రముఖులు, గ్రామం లోని పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమం ను ముందుండి నడిపించిన శ్రీకృష్ణ యాదవ సంఘం పెద్దలందరికి ధన్యవాదములు తెలుపుతూ సంఘము అధ్యక్షులును, ఉపాధ్యక్షులను శ్రీకృష్ణ యాదవ సంఘం యూత్ సభ్యులు అందరు కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎం జరిగిన మా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలుపుతూ, జాతర మహోత్సవం లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన సోమారంపేట గ్రామంలోని పెద్దలకు, మహిళలకు, ప్రజలందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
