సీఎం రేవంత్ రెడ్డి చేష్టలతో కాంగ్రెస్ కాలగర్బలో కలుస్తుంది

సీఎం రేవంత్ రెడ్డి చేష్టలతో కాంగ్రెస్ కాలగర్బలో కలుస్తుంది



న్యూస్ పవర్ , 13 మార్చి , ఇల్లంతకుంట :
 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  పై సీఎం రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి లన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి గా ఉన్నారంటే కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు.
ఆనాడు కేసీఆర్  చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాటు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం గా కేసీఆర్  అగ్రగామిలో నిలిపారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు బూట్లు మోసి ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని, కానీ కేసీఆర్  ఎత్తిన జెండా,బిగించిన పిడికిలి వదలకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు యూరియా బస్తాలు దొరకడం లేదని, రేవంత్ రెడ్డి కుట్ర రాజకీయాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వకుండా యాసంగి సీజన్ లో పంటలు ఎండబెడుతున్నారని అన్నారు.
ప్రజల బ్రతుకుల్లో మార్పు తెస్తాం... రైతులను రాజులను చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మార్పు పేరుతో ప్రజల బ్రతుకుల్లో మట్టిపోశాడని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో మునిగిపోతుందని 15 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలా తయారైందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతూ పిల్లచేష్టలు చేస్తున్నాడని, తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక గాలిమాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ లో ఇప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పతనం తప్పదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండి.సాదుల్, కూస నరేష్,కూనబోయిన రఘు, సత్యం, దోంతుల శంకర్ లింగం,మహేష్, మధు, నాగుల సాయిప్రసాద్, జనార్దన్, ప్రశాంత్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments