న్యూస్ పవర్ , 13 మార్చి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్ లో ముందస్తుగా హోలీ వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఒకరికొకరు రంగులు పులుముకొని అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హోలీ అనేది భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలలో లోతుగా పాతుకపోయినా ఒక శక్తివంతమైన పండుగ అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగుల మయమై ఆనందంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధి తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments