ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు

 ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు 

న్యూస్ పవర్, 12 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట :రామాయణాన్ని సంస్కృతం లో నుంచి తెలుగులోకి అనువాదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని మండల శాలివాహన సంఘం అధ్యక్షుడు మూడపల్లి అశోక్ అన్నారు. బుధవారం మొల్లమాంబ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రిలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాలివాహన సంఘం ఉపాధ్యక్షుడు మూడపల్లి వంశీ, జిల్లా నాయకులు చిమ్మనగొట్టు శేఖర్, హరీష్, అనిల్, చింటు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments