ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
• మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఫర్నిచర్, పవర్ బ్యాక్ అప్ ల,ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
• పిహెచ్సి భవనాల సివిల్ పనుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి
• పెద్ద లింగాపూర్ & చందుర్తి పి.హెచ్.సి. భవనాలను త్వరలో ప్రారంభానికి సిద్ధం చేయాలి.
• ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల, అక్టోబర్-25:
జిల్లాలోని పి.హెచ్.సిల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు, వాటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 2 అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 పి.హెచ్.సి లు, వాటి పరిధిలో గల సమస్యలు, అవసరమైన మౌలిక వసతులు, జెనరేటర్ , సివిల్ పనుల మరమ్మతులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔట్ పేషెంట్ వివరాలు, మిషన్ ఇంధ్ర ధనుష్, గర్భిణీ మహిళల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్, ఎన్.సి.డి సర్వే పై జిల్లా కలెక్టర్ పి.హెచ్.సి వారిగా సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ పి.హెచ్.సి లలో అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఫర్నిచర్, పవర్ బ్యాక్ అప్ , యు.పి.ఎస్. ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని క్రమ పద్ధతి ప్రకారం మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. మన ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
పి.హెచ్.సి లు, సబ్ సెంటర్ల పరిధిలో ఔట్ పేషెంట్ సంఖ్య పెంచాలని , పెద్ద లింగాపూర్ మరియు చందుర్తి పి.హెచ్.సి. భవనాలను త్వరలో ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఉన్న డయాగ్నస్టిక్ హబ్ ను వినియోగించుకోవాలని, రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు డయాగ్నస్టిక్ హబ్ ద్వారా చేయాలని కలెక్టర్ సూచించారు. డెంగ్యూ ,మలేరియా మొదలగు నిర్ధారణ పరీక్షలను అవసరమైన రోగులకు ఉచితంగా చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణీ స్త్రీల గుర్తింపు, ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ 100 శాతం జరగాలని, గర్భిణీ మహిళలు తప్పనిసరిగా టీకాలు తీసుకునేలా చూడాలని, మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం కింద పిల్లలకు పూర్తి స్థాయి టీకాల వ్యాక్సినేషన్ పూర్తి కావాలని అన్నారు.
ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని అన్నారు. వ్యాక్సిన్ భద్రత అంశంలో నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
