JSON Variables

వాణీనికేతన్ లో సాంస్కృతిక సంబరాలు

వాణీనికేతన్ లో సాంస్కృతిక సంబరాలు
న్యూస్ పవర్, 6 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ఘనంగా సాంస్కృతిక సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శనివారం కల్చరల్ కార్నివాల్ కార్యక్రమాలు కొనసాగాయి. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరాటే , అబాకస్ ప్రదర్శనలు జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు విద్యార్థులకు వివిద సాంప్రదాయ నృత్యాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో విద్యార్థులలో మానసిక ఆనందం కల్గించడమే ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.ఈ సందర్బంగా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, డ్యాన్స్ టీచరు సునందలతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments