JSON Variables

రశీదులు లేని గృహలక్ష్మి, దళిత బందు, బిసి బందు పథకాలు

రశీదులు లేని గృహలక్ష్మి, దళిత బందు, బిసి బందు పథకాలు

న్యూస్ పవర్, 9 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది రశీదు (ఆన్ లైన్ ) ఇవ్వకుండా గృహలక్ష్మి , బిసి బందు, దళిత బందు పథకాల కోసం ప్రజల నిండి దరఖాస్తులు తీసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు . ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రం లో విలేకరులతో మాట్లాడుతూ 
గృహలక్ష్మి పథకానికి రేషన్ కార్డు , ఇంటి స్థలం డాక్యుమెంట్ లు అడగడం సిగ్గు చేటని అన్నారు. తొమ్మిది సంవత్సరాల కాలం లో మీ ప్రభుత్వం ఏ జిల్లా లో ఏ అసెంబ్లీ లో ఏ ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చారా అని ఈ జిల్లా మంత్రి కెటిఆర్ ని ప్రశ్నించారు. ఇలాంటి నిబందనలు పెట్టి మోచేతి కి బెల్లం పెట్టినట్టే అని అన్నారు . దళితబందు పథకానికి ఆశావాహుల నుండి తీసుకునే ధరఖాస్తులు తీసుకునే మీరు ఆన్ రశీదు ఎందుకివ్వడం లేదని అన్నారు . బిసిబందు పేరు మీద కొన్ని కులాలకే వర్తింప చేయడం మెజారిటీ కులాలను విస్మరించడం సిగ్గు చేటని అన్నారు . మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మీ సంబంధిత మంత్రుల ద్వారా ఆ యా శాఖ ల సెక్రటరీ ల ద్వారా మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు . ఎన్నికలు సమీపుస్తున్న సమయం లో  ప్రజలకు పథకాల ఆశ చూపి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న మీకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు . ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల లింగమ్మ పటేల్ , అసెంబ్లీ ఇంచార్జ్ ఏగొళ్ల వెంకన్న గౌడ్ , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు మండల అధ్యక్షులు మాంకాళి అమర్  కొరడాని దిలీప్ , యాస రాజయ్య తదితరులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments