JSON Variables

రంగంపేటలో గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ

రంగంపేటలో గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ

 న్యూస్ పవర్ , 3 మే , ఇల్లంతకుంట :
గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు, బుధవారం మండలంలోని రంగంపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాక ముందు గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు,
మానకొండూర్ నియోజకవర్గములోని అన్నీ గ్రామాల్లో వందలాది కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు, ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుందన్నారు,
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టం జరుగుతుందని, వ్యవసాయ అధికారులతో పూర్తి స్థాయిలో సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు,తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయడం జరుగుతుందని,రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు, రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని పేర్కొన్నారు,
దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ద్వారా ₹10లక్షల సాయం అందించడం జరుగుతుందనీ పేర్కొన్నారు అర్హులైన ఇల్లులేని  నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, ఇంటి స్థలం ఉన్న వారికి గృహ లక్ష్మీ పథకం ద్వారా ₹3లక్షల సాయం చేస్తామన్నారు, అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు, రైతులకు రైతుబంధు, రైతుభీమా పథకాలతో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు, గీతకార్మికులకు కూడా ₹5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు,రంగంపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ప్రారంభించారు,
ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసి ఛైర్మన్ మామిడి సంజీవ్,రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి,  సర్పంచ్ లు వజ్రవ్వ,  శ్రీనివాస్ రెడ్డి,ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్,రంగంపేట ఉపసర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ ఎండ్ర చందన్,  ఉడుతల వెంకన్న, ర్యాగటి రమేష్, తూటి పర్శరాం,కడగండ్ల తిరుపతి 
పాల్గొన్నారు.


లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments