JSON Variables

ఎమ్మెల్యే పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదు

ఎమ్మెల్యే పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదు

 న్యూస్ పవర్ , 20 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇల్లంతకుంట బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి అధ్యక్షతన పత్రికా మీడియా మిత్రుల సమావేశం జరుగగ  ఇట్టి సమావేశంలో   సిద్దం వేణు,
 ఊట్కూరి వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ప్రజల మనిషి ,అందరివాడు అహర్నిశలు మానకొండూర్ నియోజకవర్గo కోసం కష్ట పడుతున్న నాయకుడు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్  రసమయి బాలకిషన్ నిత్యం ప్రజల మద్యనే ఉంటూ  మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ది కొరకు ఆరాట పడుతూ పగలనక రాత్రనక నియొజకవర్గంలోని గ్రామ గ్రామన తిరుగుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయాలని ఆలోచనలతో ముందడుగు వేస్తూ మానకొండూర్ నియోజకవర్గo ను అభివృద్ధి లో  ముందుoచాలని తను తపన పడుతూ ఉంటే ,కొందరు కావాలని రెచ్చగొడుతూ అసత్య ప్రచారాలు చేసుకుంటు ఆయన పై బురుద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు, ఒక దళిత ఎమ్మెల్యే పై అహంకారం తో ఇష్టమచ్చిన పదజాలంతో దూషించడం మానుకోవాలి.ఇక నుండి అసత్య ప్రచారాలు చేసుకుంటూ,సోషల్ మీడియా లో ఇష్టమచ్చినట్లు పెడితె ఊరుకునేది లేదు అని అన్నారు,
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదు.గత కొద్ది రోజుల నుండి పలు మండలాలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణ   తిరుగుతూ నియోజకవర్గ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ పై,ఎమ్మెల్యే పై అసత్య ఆరోపనలు చేయడం సరికాదు.మానకొండూర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృధ్ధేమిటో ఆయన నిరూపించండని అన్నారు.రసమయి  ప్రత్యేక చోరవతో మానకొండూర్ నియోజకవర్గంలో  నిర్మించిన రోడ్లు, కుల, గ్రామ పంచాయితీ, మహిళ సంఘ భవనాలు కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా??మానకొండూర్ నియోజకవర్గంలో  కూలీలుగా జీవనం సాగిస్తున్న పలువురిని పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా దళితబంధు పథకంతో యజమానులను చేసిన ఘనత ఎమ్మెల్యే రసమయి ది కాదా??తను చేసిన అభివృద్దిని చూసే నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని అన్నారు.ఇటీవల చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీకీ తగిన గుణపాఠం చెబుతాము అని అన్నారు,
అనంతరం రహీంఖాన్ పేట గ్రామంలోని గోదాంలో ఏ ఎం సి చైర్మేన్ మామిడి సంజీవ్ ,  సిద్దం వేణు  చేతుల మీదుగ వేయింగ్ మిషన్ లు ,తాటి పత్రులు పాక్స్  చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి, పాక్స్ వైస్ చైర్మేన్ గొడుగు తిరుపతి కు అందజేశారు...ప్రతి గ్రామంలో త్వర త్వర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని  సిద్దం వేణు  అన్నారు...ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారయణ,రహింఖాన్ సర్పంచ్ బిల్లవేణి పర్శరాములు,ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఎండి సాధుల్,ఎంపీటీసీ లు ఒగ్గు నర్సయ్య, గొట్టిపర్తి పర్శరాం గౌడ్, బర్ల తిరుపతి, పాక్స్ డైరెక్టర్లు
కట్ట లచయ్య,పారిపెళ్లి దేవేందర్ రెడ్డి,కట్ట సుధాకర్ రెడ్డి,
చల్ల నవీన్ కుమార్ రెడ్డి, ఏ ఏం సీ   డైరెక్టర్లు చిలువేరి సంతోష్ రెడ్డి,మల్లయ్య_l
యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, నాయకులు కెవిన్ రెడ్డి, బాలరాజు,ఎండీ సలీం, ఉస్మాన్, కిషన్, మధు, నాగరాజు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments