బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
NEWSPOWER REPORTER:Sairam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లోని బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాస్తవ్యులు క్రీ.శే. పట్నం శేఖర్ గారి 17 వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ *బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు, సేవకులుపాల్గొన్నారు.