గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి:* బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 16 నుంచి 18వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం.గోపాల్ తెలిపారు. కళాశాలలో ఆంగ్లము-1, తెలుగు-1, కామర్స్-2 కంప్యూటర్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీ హెచ్ డి, ఆ తర్వాత నెట్/సెట్ అర్హత గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అలాగే పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
