విముక్తి కోసం పోరాడిన దేశిని ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించిన మహానేతకు ఘన నివాళులు అర్పించిన
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా బీసీల ఆరాధ్యదైవం దివంగత మహానేత దేశిని చిన్న మల్లయ్య గౌడ్ 4వ, వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రాజు మాట్లాడుతూ నైజాం లకు వ్యతిరేకంగా దొరల భూస్వాముల పెత్తందారుల వైఖరి పట్ల వారికి ఎదురు నిలిచి ప్రజలకు వెన్నంటి నిలిచిన మహానేత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం అహర్నిశలు పాటుపడ్డారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జన్మించిన దేశిని చిన్న మల్లయ్య గౌడ్ అరు సార్లు ఇందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు గా గెలుపొంది పేద ప్రజల పక్షాన కుల వృత్తుల అభ్యున్నతికి అనేక పోరాటాలు చేసిన గొప్ప వీరుడు దేశిని అని వారి సేవలు కొనియాడారు. ఎందరో మహానుభావులు జన్మించిన భూమి మీద పేద ప్రజల కోసం కుల వృత్తులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి అత్యంత సాధారణ జీవితం గడిపిన యోధుడు భారత దేశానికి ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో మన ఇందుర్తి ఎమ్మెల్యే గా దేశిని చిన్న మల్లయ్య వారిపట్ల ప్రత్యేక గౌరవంగా ఉండి పివి గారి సహకారంతో ముందుకు సాగిన తీరు, పనిచేస్తు తీరు తెలుగు ప్రజలకు చాలా గర్వంకారణం అని రాజు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ నేత, గౌడ సంఘం అధ్యక్షుడు పి. రవీందర్ గౌడ్,పిట్టల రమేష్ ముదిరాజ్, మటూరి గోపి, నరేష్ మల్లయ్య, పి. రాజు, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.