తాటి చెట్టు పై నుండి పడ్డ గీత కార్మికులు పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం
న్యూస్ పవర్ రిపోర్టర్ రెవొజురాజ బ్రహ్మచారి
తాడిచేట్టు పై నుండి ప్రమాదవశాత్తు పడిపోయి కరీంనగర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కూరేళ్ల గీతాకార్మికుడుని పరామర్శించిన బిజెపి కోహెడ మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం, నిరుపేద కుటుంబానికి చెందిన ముంజ రమేష్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
కూరేళ్ల గ్రామానికి చెందిన గౌడ కులస్తుడు ముంజ రమేష్ వయస్సు 27 వృత్తిరీత్యా గీతా కార్మికుడైన అతడు ప్రమాదవశాత్తు తాడిచేట్టు పైనుంచి క్రిందపడి గాయాలై కరీంనగర్ ప్రవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న అతనిని ఈరోజున పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ ప్రాణాన్ని పణంగా పెట్టి జీవనోపాధికి కులవృత్తిని నమ్ముకొని జీవించే నిరుపేద కుటుంబానికి చెందిన ముంజ రమేష్ వైద్య ఖర్చులకు బ్రెన్ వెన్నుపూస ఆపరేషన్ నిమిత్తం సుమారుగా 2 నుండి 3 లక్షల రూపాయల ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో నిరుపేద గీతా కార్మికునికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కూరేళ్ల మాజిసర్పంచ్ తల్లాపల్లి ఎల్లయ్య గౌడ్, గ్రామస్తులు బుర్ర పర్శరాములు గౌడ్, కుటుంబ సభ్యులు ముంజ కనకయ్య, సత్తవ్వ,తాటిపాముల రాజు ఉన్నారు.
