మానవత్వం చాటుకున్న ఆర్.ఐ అడ్మిన్ కుమారస్వామి గారు
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
సిరిసిల్ల పట్టణంలో చలికి తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న యాచకులను 20 మందిని గుర్తించి వారికి శనివారం రోజు రాత్రి 8 గంటల సమయంలో ఆర్.ఐ కుమారస్వామి గారు రగ్గులు పంచి మానవత్వం చాటుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు,పోలీసుల్లోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు.అనంతరం ఆర్.ఐ గారు మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉన్నందున యచకులకు మావంతుగా సహకారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు.
