JSON Variables

కన్న తల్లికి కూడుపెట్టానోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు



కన్నతల్లికి కూడు పెట్టనివాడు, సవతితల్లికి  బంగారుగాజులు చేయిస్తానన్నట్లు ఉంది ముఖ్యమంత్రి కే.సి.ఆర్.తీరు కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ 
NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 
ఇన్నాళ్లుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులవైపు ఏనాడూ కన్నెత్తిచూడని కేసీఆర్ అక్కడ చనిపోయిన రైతులకు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల చొప్పున మొత్తం ఇరవైఒక్క కోట్లు తెలంగాణా ప్రభుత్వం తరపున ఇవ్వండి కాని అలాగే ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోండి అని నేను రైతు బిడ్డగా డిమాండ్ చేస్తున్నాను 
ఇన్నాళ్లుగా అక్కడ ఢిల్లీ వీధుల్లో ఉద్యమించిన రైతుల వద్దకు సంఘీభావంగా తాను వెళ్ళలేదు, తన ప్రతినిధులను కనీసం ఒక్కరినీ అక్కడకు పంపించలేదు కాని ఇప్పుడు ఇంత ప్రేమ ఎలా పుట్టిందో అర్దం కావడం లేదు 
మల్లన్నసాగర్ రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంతవరకూ ఇవ్వలేదు
అధికారంలోకి వచ్చే ముందు లక్ష రుపాయల రుణ మాఫీ అమలు చేయలేదు రైతుల వడ్ల  కోనుగోలు సక్రమంగా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రైతులు వెంటనే లక్ష రుపాయల రుణ మాఫీ మరియు వడ్ల కోనుగోలు వెగవంతం చేయాలని కాంగ్రెస్ మరియు బి.సి.సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో మహెందర్ సింగ్ ,సింగిరాల కుమార్ ,బౌరోజు జగన్,మహమ్మద్ ఖరీమ్,తదితరులు పాల్గోన్నారు

Post a Comment

0 Comments