నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం అందించాలి
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్ఆర్ఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి పంట వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా
చేతికొచ్చిన వరి పైరు పూర్తిగా నేలకొరిగిన నేపథ్యంలో మొలకలు వచ్చి రైతులు ఆరుగాలం పండించిన పంటను కోల్పోయిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.వేలాది ఎకరాల్లో పూర్తిగా పంట నేలమట్టమైందని రైతులు పంటను నోచుకోలేని పరిస్థితిలో వరి నేలకు వాలి మొలకలు వచ్చాయి.పంట నష్టపోయిన రైతులకు
ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి లేని పక్షంలో రైతులకు మద్దత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దిశెట్టి సుధాకర్, అందుగుల లింగయ్య, బక్కులు, బొడిగే శంకర్ గౌడ్, శ్రీరాములు, రవి నాయక్, కందుల వెంకట్ రెడ్డి, అజయ్, జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
0 Comments