జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు
బెల్లంపల్లి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. సీనియర్, జూని యర్, సబ్ జూనియర్ల విభాగాల్లో బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. 150 మంది క్రీడాకారులు హాజరైనట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేష్‌లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తుది జట్టును త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పీఈటీలు రమేష్‌కుమార్, యాదగిరి, రాధారాణి, ప్రహ్లాద్, మీనా, అనూష, రేష్మా, శివకుమార్, ప్రేంకు మార్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పోచన్న తదితరులు పాల్గొన్నారు.