జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిని నీ సన్మానించిన
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా: నవంబర్20,(కోహెడ మండలం) ధర్మసాగర్ పల్లి గ్రామానికి చెందిన పెండల మల్లయ్య మంజుల దంపతుల ద్వితీయ పుత్రిక పెండల హేమలత జాతీయ స్థాయిలో సైక్లింగ్ పోటీలకు ఎంపికైన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఘనంగా సన్మానించారు. అనంతరం రాజు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సాహించి ,సైక్లింగ్ లో ఉపయోగించే సైకిల్ చాలా రెండు లక్షల రూపాయల ఖర్చుతో కుడుకుంటుంది కావున ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని రాజు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.జాతీయ స్థాయిలో హ్యార్యనా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలో ఈనెల తేది 25నుంచి 29 వరకు జరిగే సైక్లింగ్ పోటీల్లో హేమలత పాల్గొనడం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ,కోహెడ మండల ప్రజలు గర్వించదగ్గ విషయం అని వారికి మంచి జరగాలని, అక్కడ తప్పకుండా విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు పెండల మల్లయ్య ముదిరాజ్ ,మంజుల ,ఎల్లవ్వ కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments