నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు.. ఎస్సై రమాకాంత్

నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు.. ఎస్సై రమాకాంత్


మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలరం గ్రామానికి చెందిన జంబి శ్రీనివాస్ కుటుంబీకులు పోలీసుల పై అసత్య  ప్రచారాలు చేయడం సరికాదని ఎస్సై రమాకాంత్ అన్నారు. 

తేదీ 15.11.2021 న జోగపుర్ ప్రాజెక్ట్ ప్రాంతం లో పెట్రోలింగ్ చేయుచుండగా Narwaipet గ్రామానికి చెందిన పాల్త్య సంతోష్ అనే వ్యక్తి బైక్ పైన 
గుడుంబా తరలిస్తుండగా దొరకగా అతనిపై కేసు నమోదు చేసి విచారించగా అతను మైలారం గ్రామానికి చెందిన జంబి శ్రీను మరియు టేకం లచ్చయ్య అనే వ్యక్తులు గుడుంబా కావాలని అడగగా వారికి తీసుకెళ్తున్న అని తెలపగా ఒక పార్టీ నీ వారి ఇండ్లలో సోదా చేయడానికి పంపడం జరిగింది. Mailaram లోని జంబీ శ్రీను ఇంట్లో సోదాలు చేయునపుడు శ్రీను సమక్షం లోనే మొత్తం వీడియో తీస్తూ సోదా చేయడం జరిగింది, అంతే కానీ వాళ్ళు తెలిపినవి అన్ని అవాస్తవాలు.  కేసుకు మరియు సోదాలకు సంబందించిన అన్ని ఆధారాలు సాక్షాలు మా దగ్గర ఉన్నాయి మరియు వారి call డిటైల్స్ కూడా అన్ని తెప్పించి టెక్నికల్ గా వెరిఫై  చేయడం జరుగుతుంది. కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మరియు కేసు నుండి తప్పించుకునే ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
 ప్రజా క్షేమమే లక్ష్యంగా ప్రజల ప్రశాంతత కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై వ్యక్తి గత దూషణలు చేయడం సరికాదని ఎస్ఐ పేర్కోన్నారు.

Post a Comment

0 Comments