బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా మంచిర్యాల వాస్తవ్యులు పెంచల శ్రీవాణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి శ్యామ్ సుందర్ గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో శనివారం మధ్యాహ్నం IB తాండూరులో యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు పేదవారికి అన్నదానం పంచడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. *బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్* ద్వారా *ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం* అని పిలుపునిచ్చారు మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు . అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.