సిరిసిల్లలో ఆశా వర్కర్ల మహా పాదయాత్ర
*ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ తో ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టడం జరిగింది*
*ఈ పాదయాత్ర , ధర్నా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ !! P.జయలక్ష్మి గారికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ గారు పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ గారూ సిఐటియు జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ పాదయాత్ర సిరిసిల్లలోని గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ పాత బస్టాండ్ మీదుగా బైపాస్ లో గల కలెక్టర్ వద్దకు చేరుకొని కలెక్టర్ కార్యాలయం ముందు రెండు గంటలపాటు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది*
*ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి ధర్నా వద్దకు వచ్చి ఆశా వర్కర్ల సమస్యలు డిమాండ్ల రూపకంగా ఉన్నా వినతిపత్రాన్ని తీసుకోని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆశా వర్కర్లు ధర్నా విరమించడం జరిగింది*
*ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్లకు 30 శాతం పిఆర్సి నిపెంచడం జరిగిందని కానీ ఇంతవరకు పెంచిన పిఆర్సి వేతనాలను అందించడం లేదని , అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశాలకు ఇస్తున్న మాదిరిగా పిక్చర్ వేతనం పదివేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని , ఆశా వర్కర్ల పనికి , పని గంటలకు సంబంధించి జాబ్ చాట్ ను విడుదల చేయాలని , ఆన్లైన్ సర్వే లకు సంబంధించి పార్ట్ ఫోన్ నెట్ బ్యాలెన్సు అందించాలని , ఆశా లకు వారానికి ఒకరోజు సెలవు మరియు పండగ సెలవులు అమలు చేయాలని , ప్రింట్ చేసిన రిజిస్టర్ లను వెంటనే సప్లై చేయాలని , కరోనా తో చనిపోయిన ఆశలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని , ఆశా ల తో అదనపు పనులు చేయించు కూడదని , ఆస్పత్రిలో రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించాలని , పెండింగ్ యూనిఫామ్స్ అందించాలని , ANM నియామకాలలో అశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని , ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని , ఆశా వర్కర్ల పై అధికారుల వేధింపులు అరికట్టాలని , ఆశా వర్కర్లకు తొలగించిన అన్ని రకాల పెన్షన్ లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు*
*ఈ పాదయాత్రలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు భారతి , జయశీల ,మంజుల , గాయత్రి , లావణ్య , లక్ష్మి , సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి , అన్నల్దాస్ గణేష్ , జవాజి విమల , గురజాల శ్రీధర్ , రామంచ అశోక్ , గడ్డం ఎల్లయ్య , ప్రశాంత్ , రమేష్ చంద్ర , మునీందర్ , పోచమల్లు ఆశా వర్కర్లు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది*
