*అభినవ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం*
మంచిర్యాల: తాండూరు మండలం కత్తెర్ల గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను అక్కడ ఉన్న 25 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రైవేటు విద్యావాలంటరితో సోమవారం నుండి పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అభినవ ఆధ్వర్యంలో ప్రతిరోజు మద్యాహన భోజనం చపాతీ , గుడ్డు తో పాటు అరటి పండ్లు ఇస్తున్నామని అభినవ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యావాలంటరీ గౌరవ వేతనం ఇవ్వడం కోసం యం పి టి సి బుగ్గ ఆలయం చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు ,బోయపల్లి ఉప సర్పంచ్ రౌతు వెంకటేశం ,ద్వారక పూర్ సర్పంచ్ మాసడి శారద సత్తయ్య , బోయపల్లి ఉపాధ్యాయులు సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం నోట్ బుక్స్ , పెన్నులు , పెన్సిల్స్ వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అభినవ స్వచ్చంద సేవాసంస్థ ద్వారా సమకూర్చుతున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు మధ్యన భోజనం అభినవ సేవ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నామని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా యం పి టి సి బుగ్గ ఆలయం చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు , ద్వారక సర్పంచ్ మాసడి శారద సత్తయ్య , ఐ సి డి యస్ సూపర్ వైజర్ రమాదేవి ,అభినవ సంతోష్ కుమార్ లు హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సుమలత , విద్యావాలంటరీ బోగరపు భాను , సేవసంస్థ సభ్యులు కాసం ఆకాష్ ,లలిత , లక్ష్మణ్ , గ్రామస్తులు,వెంకటేష్ , రాజేష్ , అమృత , సంధ్య , శ్రీమతి ,సుమలత , పద్మ , చిలుకమ్మ , సంధ్య , శైలజ , తదితరులు పాల్గొన్నారు.
