బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీ బొద్దున శంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. సేవా ట్రస్ట్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ *బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్* ద్వారా *ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం* అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు, సేవకులుపాల్గొన్నారు.