NEWS POWER REPORTER:ఆర్ బి చారి
నేడు కాజిపేట్ మండల మహిళా అధ్యక్షురాలుగా బైరి రజని వేణు యాదవ్ గారిని నియమిస్తూ హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి బంక సరళా ఉత్తరువులు జారి చేసారు. ఈ సందర్భంగా ఈ ఉత్తర్వుల కాపీని హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి రెడ్డి గారు, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి బంక సరళ చేతుల మీదుగా బైరి రజని వేణు యాదవ్ తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్, బైరి లింగ మూర్తి, కుర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.