ఎం ల్ ఎ. రసమయి బాలకిషన్ కళ నెరవేరాబోతుంది
న్యూస్ పవర్.
బొల్లం సాయిరెడ్డి
డాక్టరేట్ పట్టాను అందుకోబోతున్న మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ.రసమయి బాలకిషన్ గారు...
- ప్రజాగాయకులు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ.రసమయి బాలకిషన్ గారు డాక్టరేట్ పట్టాను అందుకోబోతున్నారు.
- 14 సంవత్సరాల పాటు ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ధూందాంను నెలకొల్పిగల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ ఆటా పాటలతో ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర రసమయి గారికే దక్కింది.
- స్వరాష్ట్ర సాంస్కృతిక ఉద్యమంలో ధూందాం పాత్రపై PHD పరిశోధన గ్రంధాన్ని పూర్తి చేసి ఈరోజు రసమయి గారు ఫైనల్ వైవా ఇచ్చారు. రసమయి గారి నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం ధూందాం పుట్టుక, ఆవశ్యకత ఏర్పడింది.
- దీంతో ఆయన ఈరోజు PHD గ్రంధాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వ విద్యాలయం ప్రొపెసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టరేట్ పట్టాను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి గారు అందుకొనున్నారు.
- ఇక నుంచి డాక్టర్ రసమయిగా మారుతున్నందుకు రాష్ట్ర ప్రజలతో పాటు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
