ఇది మన డిజెఎఫ్ యూనియన్ సాధించిన గొప్ప మైలురాయి
జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉన్నదని , పాత్రికేయుల సమస్యల సాధన కోసం తమ పార్టీ బలంగా పోరాడుతుందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్(డిజెఎఫ్) నాయకులు కొదండరాంని కలిసి రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా తయారయిందని, పాత్రికేయ వృత్తిలో సరిjైున ఉపాధి అందక అవస్తలుపడుతున్నారన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులపై రాజకీయ నేతల ఒత్తిళ్లతో కొందరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల మూలంగా పాత్రికేయుల పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని ఇలాంటి పరిస్థితుల్లో వారి సంక్షేమంపై పాలకులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని కోదండరాంకి వివరించారు. అయితే తమ పార్టీ టిజెఎస్ నిర్వహిస్తున్న పలువేదికల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తున్నామని రానున్న రోజుల్లో మరింత అధ్యయనం చేసి పాత్రికేయ సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా డిజెఎఫ్ నేతలకు హామీ ఇచ్చారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో పాత్రికేయుల సమస్యలను చేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి పాత్రికేయులపై పలు ప్రాంతాల్లో నమోదవుతున్న అక్రమ కేసుల విషయంలో జర్నలిస్టులకు మద్దతు తెలపాలని ప్రొఫెసర్ కోదండరాంని కోరగా అందుకు ఆయన సమ్మతించారు. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి తిరుపతి రెడ్డి, డిజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగందర్ తదితరులు పాల్గొన్నారు.
