*హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు..*
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాముని చెరువు కట్ట పైన లయన్ నాగుల సంతోష్ జిల్లా గవర్నర్ ఆదేశాల మేరకు నవంబర్ నెల మధు మేహ అవగాహన మాసం సందర్భంగా రాముని చెరువు కట్ట పైకి ఉదయం వాకింగ్ కు, జాగింగ్ కు వచ్చే వాకర్స్ కు, విశ్రాంత కార్మికులకు, సీనియర్ సిటిజన్స్ కు 77 మందికి ఉచితంగా షుగర్, బి పి, diabetic, బ్లడ్ ప్రెజర్ పరీక్షలు చేశారు.. ఈ సందర్భంగా LC సభ్యులు మాట్లాడుతూ మధు మేహం, షుగర్, బి పి కంట్రోల్ లో ఉండటానికి, తాగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ రావుల ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి గజెల్లి వెంకటయ్య, JT సెక్రటరీ డి రాజేశంగౌడ్, ZC పూరెల్ల పోషమల్లు, GLT కోఆర్డినేటర్ సిహెచ్ హనుమంతరావు, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ జీ కృష్ణమూర్తి, లయన్ చెట్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు..
